సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:34 PM
ఈనెల 9వ తేదీన డోన్ మం డలంలోని కొత్తబురుజులో జరిగే సీఎం నారా చంద్రబాబునాయుడు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
డోన్ టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఈనెల 9వ తేదీన డోన్ మం డలంలోని కొత్తబురుజులో జరిగే సీఎం నారా చంద్రబాబునాయుడు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో కొత్తబురుజులో ఏర్పాటుచేసే సభా స్థలం, హెలిప్యాడ్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే కోట్లతో కలిసి జేసీ కార్తీక్, టీడీపీ యువ నేత కోట్ల రాఘవేంద్రరెడ్డి, ఆర్డీవో కేపీ నరసింహులు, డీఎస్పీ శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. సభా వేదిక నిర్మాణం, హెలిప్యాడ్ స్థల ఎంపిక, రూట్ మ్యాప్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, భద్రతా అంశాలపై సమగ్రంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బేతంచెర్ల, ప్యాపిలి, డోన్ కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోట్రికే ఫణిరాజ్, వలసల రామకృష్ణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టీఈ కేశన్నగౌడు, పట్టణ అధ్యక్షుడు టీఈ రాఘవేంద్రగౌడు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.