9న బనగానపల్లెకు సీఎం రాక
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:55 PM
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 9వ తేదీన బనగానపల్లెలో పర్యటిస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు.
చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయాలి
మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష
బనగానపల్లె, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 9వ తేదీన బనగానపల్లెలో పర్యటిస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని అధి కారులతో పాటు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం చంద్ర బాబు పర్యటన నేపథ్యంలో బుధవారం కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్‌లతో మంత్రి బనగానపల్లె ఎంపీడీఓ కార్యాల యంలో సమీక్ష నిర్వహించారు. 9వ తేదీ గురువారం బనగానపల్లె ఉన్నతపాఠశాల మైదానంలో ‘మీభూమి-మీహక్కు’కు సంబంధించి అప్పలాపురం, కాపులపల్లె రైతులకు పాసుపుస్తకాల పంపి ణీతో పాటు బహిరంగ సమావేశం ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో భద్రత, చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి శాఖ తమకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు. భారీ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తగిన ఏర్పాట్లు, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బహిరంగ సభ వద్ద ఏర్పాట్లు, బందోబస్తు పోలీసులకు భోజన వసతి ఏర్పాట్లపై సమీక్షించారు. ఆర్‌ఆండ్‌బీ శాఖ, పోలీస్, పైౖర్, విద్య, వైద్యం, 104, 108, ఫుడ్‌సేఫ్టీ, పట్టణంలో చేపట్టాల్సిన పారిశుధ్యంపై డీఆర్‌డీఏ క్షుణ్ణంగా అన్ని శాఖలపై సమీక్షించారు. సీఎం పర్యటనలో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. హార్టికల్చర్ స్టాల్, పౌష్టికాహారం స్టాల్, వెంగమ్మపేణీ స్టాల్స్, ప్రకృతి వ్యవసాయం స్టాల్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సీఎం చంద్రబాబు పర్యటించే ప్రాంతాలను మంత్రి, కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. కర్నూలు రహదారిలోని ఎస్సార్బీసీ స్థలంలో హెలీప్యాడ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో నరేంద్రనాథరెడ్డి, డీపీవో లలితాబాయి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌డీఏ శ్రీధర్, డోన్ డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.