Share News

బాధితులకు అండగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:20 AM

: చికిత్స చేయించుకున్న బాధితులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అండగా నిలుస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

బాధితులకు అండగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌
చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి ఫరూక్‌

నంద్యాల రూరల్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : చికిత్స చేయించుకున్న బాధితులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అండగా నిలుస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో నంద్యాల నియోజకవ ర్గానికి చెందిన 29 మంది బాదిత కుటుంబ సభ్యులకు రూ.33.50 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అత్యాఽధునిక వైద్య సౌకర్యాలు పొందిన వారిని మానవత్వంతో ఆదుకోడానికి చెక్కులు ఇచ్చామన్నారు. ఇంకా ఎవరైనా సాయం అందని వారు ఉంటే పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Updated Date - Mar 16 , 2026 | 12:20 AM