బాధితులకు వరం.. సీఎం సహాయనిధి
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:47 PM
ఆసుపత్రుల్లో చికిత్స పొంది, బాధితులకు సీఎం సహాయనిధి వరమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రూ.15,84,215 విలువైన చెక్కులను అందించామన్నారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
డోన్ టౌన్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రుల్లో చికిత్స పొంది, బాధితులకు సీఎం సహాయనిధి వరమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రూ.15,84,215 విలువైన చెక్కులను అందించామన్నారు. పేద కుటుంబాలకు ఈ సహాయం ఊరట కలిగిస్తుందన్నారు. చండ్రపల్లి లక్ష్మీనారాయణ యాదవ్, ఎద్దులదొడ్డి ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామచంద్ర మాలిక్ బాబా ఎద్దుల బండలాగుడు పోటీలు ఎమ్మెల్యే కోట్ల ప్రారంభించారు. అంతకుముందు మాలిక్‌బాబా సంస్థాన్‌లో ఎమ్మెల్యే కోట్ల ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తమ ప్రభుత్వం రైతులలకు గిట్టుబాటు ధర కల్పించిందన్నారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, వెంకటనాయునిపల్లె శ్రీనివాసులు యాదవ్, సందు వెంకటరమణ, చనుగొండ్ల శ్రీరాములు, కోట్రికే హరికిషన్, టీఈ రాఘవేంద్రగౌడు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌గౌడ్, ఆలేబాదు పరమేష్, భూమా నాగన్న, పెద్ద తిమ్మయ్య యాదవ్, బొంకు రవి, తదితరులు పాల్గొన్నారు.