Share News

పేదలకు అండగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:53 PM

నిరుపేదల పాలిట సీఎం రిలీ్‌ఫపండ్‌ అంగా ఉందని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు రూ.35లక్షను 65 మంది బాధితులకు పంపిణీ చేశారు.

పేదలకు అండగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌
చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల పాలిట సీఎం రిలీ్‌ఫపండ్‌ అంగా ఉందని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు రూ.35లక్షను 65 మంది బాధితులకు పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్యానికి టీడీపీ ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు. సీఎం చంద్రబాబురాష్ట్రంలో ఎందరో ప్రాణాలు నిలబెట్టారన్నారు.

రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మంగళవారం పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను స్వయంగా పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అఽధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన షాపుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం షాదీఖానా భవనాన్ని పరిశీలిచి సూచనలు చేశారు. డీఈ నాగశ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి ప్రభుత్వం మంజూరు చేసిన నూతన అగ్ని మాపక వాహనాన్ని ప్రారంభించారు. ప్రజల ఆస్తుల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, విపత్తుల సమయంలో సత్వర స్పందనకు ఈ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు.

Updated Date - Apr 14 , 2026 | 11:53 PM