Share News

బాధితులకు వరం.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:25 AM

చికిత్స చేయించుకున్న బాధితుకలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వరమని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలోనియోజకవర్గంలోని 56 మంది నిరుపేదల లబ్ధిదారులకు రూ. 27.28 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

బాధితులకు వరం.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌
చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): చికిత్స చేయించుకున్న బాధితుకలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వరమని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలోనియోజకవర్గంలోని 56 మంది నిరుపేదల లబ్ధిదారులకు రూ. 27.28 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ టీడీపీపాలనలో క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజారోగ్యానికి సీఎం చంద్రబాబు కొండంత అండగా ఉన్నారన్నారు.

విద్యార్థులను అభినందించిన మంత్రి

నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షి్‌పకు ఎంపికైన విద్యార్థులను మంత్రి సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో అభినందించారు. హెచ్‌ఎం. నాగరాజుతో కలసి స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్థులు మంత్రిని కలిశారు. ముక్కమళ్ల ఉన్నతపాఠశాల హెచ్‌ఎం. నాగరాజు, 8వతరగతి చదువుతున్న మానస, శ్వేత, అజిత్‌కుమార్‌, మధురిమను అభినందించి, జ్ఞాపిక అందించారు.

సమస్యలను పరిష్కరించండి

ప్రజలు ఇచ్చే అర్జీలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించారు.

Updated Date - Mar 17 , 2026 | 12:25 AM