Share News

బాధితులకు అండగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:14 AM

నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అండగా ఉందని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

బాధితులకు అండగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌
చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, జూలై 17 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అండగా ఉందని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలంలో నియోజకవర్గంలోని 36 మంది బాధితులకు రూ.31.14 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడి చికిత్స పొందిన బాధిలకు సీఎం చంద్రబాబు భరోసా ఇస్తూ, రాష్ట్రంలో ఎన్నో ఫ్రాణాలు నిలబెట్టారని మంత్రి అన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 12:14 AM