పేదలకు వరం.. సీఎం రిలీఫ్ ఫండ్
ABN , Publish Date - May 15 , 2026 | 11:35 PM
పేదప్రజల ఆరోగ్యానికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తొందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె, మే 15 (ఆంధ్రజ్యోతి): పేదప్రజల ఆరోగ్యానికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తొందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 53 మంది లబ్దిదారులకు రూ.21.04 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తోందన్నారు. నిరుపేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల వెన్నంటే ఉంటుందన్నారు.
టీడీపీ నాయకుడి మృతికి మంత్రి సంతాపం
సాధుకొట్టం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి(55) మృతి చెందాడు. మంత్రి మృతుడి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుం బాన్ని ఆదుకుంటామని తెలిపారు. రామచంద్రారెడ్డి, చిన్నస్వామి ఉన్నారు.
పనులు వేగంగా పూర్తి చేయండి
మండలంలోని సాధుకొట్టం వద్ద రూ.2.80 కోట్లతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి బీసీ ఆదేశించారు. శుక్రవారం పనులను తనిఖీ చేసి, ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచనలు చేశారు. అనంతరం పాతపాడు గ్రామంలో చేస్తున్న యాగంటి ముఖ నిర్మాణం పనులను మంత్రి పరిశీలించారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్‌ప్లాంట్, నీటిని శుద్ధిచేసే యంత్రాల పనితీరు, ప్లాంట్ నిర్వహణ, మంచినీటి నాణ్యతను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు పరిశురఽభమైన మినరల్‌వాటర్ అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈప్లాంట్‌ను నెలకొల్పినట్లు తెలిపారు. ఆర్‌ఆండ్‌బీ ఏఈ హుసేని టీడీపీ నాయకులు పాతపాడు మాజీ సర్పంచ్ బెడదల మహేశ్వరరెడ్డి, రామశేఖర్ సంగు శ్రీనివాసరెడ్డి, చిన్నస్వామి, తిరుమలయ్య పాల్గొన్నారు.