ఆపన్న హస్తం సీఎం సహాయ నిధి
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:52 AM
ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు ఆపన్నహస్తమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రూ.35,97,311ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు
డోన్ టౌన్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు ఆపన్నహస్తమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రూ.35,97,311ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. 16 నెలల్లోనే నియోజకవర్గానికి 543 మంది లబ్దిదారులకు రూ.5,11,99,337ల సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశామన్నారు. ఆరోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య అవసరాలు, ప్రమాదాలు, సంక్షేమ కారణాలతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోట్రికే ఫణిరాజ్, వలసల రామకృష్ణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటనాయునిపల్లె శ్రీనివాసులు యాదవ్, టీడీపీ పట్టణ అధ్యక్షులు టీఈ రాఘవేంద్రగౌడు, చండ్రపల్లె లక్ష్మినారాయణ యాదవ్, సీమ సుధాకర్ రెడ్డి, శేషఫణిగౌడు, బేతంచెర్ల పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి, ఎల్ల నాగయ్య, ఎద్దులదొడ్డి ప్రభాకర్ రెడ్డి, సంధు వెంకటరమణ తదితరులు ఉన్నారు.