Share News

8న ఎమ్మిగనూరుకు సీఎం చంద్రబాబు రాక

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:51 PM

సీఎం చంద్రబాబు ఈనెల 8న ఎమ్మిగనూరుకు రానున్నారు. మండలంలోని కలుగొట్ల గ్రామంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కోసం సీఎం రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

8న ఎమ్మిగనూరుకు సీఎం చంద్రబాబు రాక
కలుగోట్ల గ్రామంలో హెలిప్యాడ్‌కోసం స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, జేసీలు

హెలిప్యాడ్‌ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే బీవీ, జేసీ

ఎమ్మిగనూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఈనెల 8న ఎమ్మిగనూరుకు రానున్నారు. మండలంలోని కలుగొట్ల గ్రామంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కోసం సీఎం రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కలుగొట్ల గ్రామ సమీపంలోని నాగార్జున సీడ్స్‌ గోదాం ఏరియా, ఉషోదయ బీఈడీ కాలేజి దగ్గర హెలిప్యాడ్‌ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, జేసీ నూరూల్‌ క్వామర్‌, సబ్‌ కలెక్టర్‌ అజయ్‌ కుమార్‌ స్థలాలను పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలి క్యాప్టర్‌లో కలుగొట్ల హెలిప్యాడ్‌కు చేరుకునే అవకాశం ఉంది. రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను కూటమి ప్రభుత్వం రైతులకు అందజేస్తుంది. ఇప్పటికే రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతినెల ప్రతిమండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పాసుపుస్తకాలు పంపిణీ చేస్తారు. అందులో భాగంగా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ఈనెల 8న 1, 513 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. వీటి పంపీణీ కోసం సీఎం చంద్రబాబు రానున్నారు. అందులో భాగంగానే అధికారయంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. అధికారికంగా పర్యటన షెడ్యూల్‌ రావాల్సి ఉంది.

Updated Date - Jan 31 , 2026 | 11:51 PM