ప్రజల సహకారంతోనే పరిశుభ్రత
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:00 AM
ప్రజల సహకా రంతోనే నగర పరిశుభ్రత సాధ్యమని కలెక్టర్, నగర పాలక ప్రత్యేక అధికారి డా.ఏ. సిరి అన్నారు.
కలెక్టర్, నగర పాలక ప్రత్యేక అధికారి సిరి
కలెక్టరేట్ ప్రాంగణంలో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర
కర్నూలు న్యూసిటీ, జూన్ 20(ఆంధ్రజ్యోతి): ప్రజల సహకా రంతోనే నగర పరిశుభ్రత సాధ్యమని కలెక్టర్, నగర పాలక ప్రత్యేక అధికారి డా.ఏ. సిరి అన్నారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్, మున్సిపల్ కమి షనర్ చల్లా ఓబులేసుతో కలిసి స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రజలు ఉద్యోగులతో స్వర్ణ ఆంధ్ర-స్వఛ్చ ఆంధ్ర స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యక్రమాన్ని విజ యవంతంగా పూర్తి చేశా మని అన్నారు. పారిశుధ్యంపై ప్రజల్లో అవగా హన పెరగాలని, చెత్తను ఎక్కడబడితే అక్కడ వేయకుండా తడి, పొడి, హానికరమైన, ప్రత్యేకమైన వ్యర్థాలను వేర్వేరుగా చేసి మున్సిపల్ వాహనా లకే అప్పగించాలని సూచిం చారు. పర్యావరణానికి హాని కలిగించే వ్యక్తులకు జరిమానాలు విధించే అధికారాలను దేశ అత్యున్నత న్యాయ స్థానం కలెక్టర్లకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. నగర శుభ్రత కోసం ప్రభుత్వం, నగర పాలక సంస్థ, పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించి సహకరించాలని ఆయన కోరారు. డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రజా రోగ్య అధికారి డా.ఎం. రఘు, శానిటరీ సూపర్ వైజర్ రమేష్‌బాబు, డీఈలు పవన్‌కు మార్‌రెడ్డి, కృష్ణలత, ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.