స్వచ్ఛతే క్లీన్ స్వీప్ లక్ష్యం
ABN , Publish Date - May 23 , 2026 | 11:56 PM
స్వచ్ఛతా ప్రమాణాలే ఆపరేషన్ క్లీన్ స్వీప్ లక్ష్యమని, ప్రజా జీవనంలో పరిశుభ్రతే ముఖ్యం అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
ప్రజా జీవనంలో పరిశుభ్రత ముఖ్యం
మంత్రి ఫరూక్
నంద్యాల రూరల్, మే 23 (ఆంధ్రజ్యోతి) : స్వచ్ఛతా ప్రమాణాలే ఆపరేషన్ క్లీన్ స్వీప్ లక్ష్యమని, ప్రజా జీవనంలో పరిశుభ్రతే ముఖ్యం అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని గాందీచౌక్‌లోని కూరగాయల మార్కెట్‌లో మంత్రి స్వయంగా చీపురు పరిసరాలను శుభ్రంచేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 పట్టణాలలో నేటి నుంచి జూన్ నెల చివరి వరకు నెలరోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నంద్యాలను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఇ గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.
ఆటోనగర్ కార్మికుల సంక్షేమానికి కృషి
పట్టణ శివారులోని ఆటోనగర్ ప్రాంత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. శనివారం గాందీచౌక్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. ఆటోనగర్‌లో మౌలిక వస తుల కల్పనకు దాదాపు రూ 10 కోట్ల మేరకు ప్రణాళికలు సిద్ధం చేశామని త్వరలో పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. గతంలో కార్మికులకు కేటాయించిన స్థలాల విషయంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.