స్వచ్ఛ కార్యకర్తలు అవసరం
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:49 AM
నగరాన్ని ‘స్వచ్ఛ నగరంగా’ తీర్చిదిద్దేందుకు ప్రతి ఇంట్లో ఒక స్వచ్ఛ కార్యకర్త అవస రమని నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ అన్నారు.
నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): నగరాన్ని ‘స్వచ్ఛ నగరంగా’ తీర్చిదిద్దేందుకు ప్రతి ఇంట్లో ఒక స్వచ్ఛ కార్యకర్త అవస రమని నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ అన్నారు. బుధవా రం స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో పాఠశాల, కళాశాలల నిర్వాహకులతో సమావేశం నిర్వహిం చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ మార్గదర్శకాల్లో భాగంగా విద్యాసంస్థల నిర్వాహ కులు, విద్యార్థుల పాత్రలను కమిషనర్ వివరించారు. కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులను స్వచ్ఛ సైన్యంగా తీర్చిదిద్దాలని సూచిం చారు. ప్రతి విద్యాసంస్థలో మరుగుదొడ్లు, డస్ట్‌బినలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, తడి-పొడి చెత్తను వేర్వేరుగా నిర్వహించడం, హోం కంపోస్టింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటి కమిషనర్ సతీష్ కుమార్‌రెడ్డి, ప్రజారోగ్య అధికారి డా.నాగప్రసాద్‌బాబు, శానిటేషన ఇన్సపెక్టర్లు పాల్గొన్నారు.