నీటి సరఫరాను మెరుగుపరచాలి
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:16 AM
నగరంలో తాగునీటి సరఫరా మరింత మెరుగుపరచాలని, కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ఫిర్యాదులను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు.
నీటి శుద్ధి కేంద్రంలో యంత్రాల మరమ్మతు చేపట్టండి
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): నగరంలో తాగునీటి సరఫరా మరింత మెరుగుపరచాలని, కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ఫిర్యాదులను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అశోక్‌నగర్‌లోని నీటి శుద్ధి కేంద్రం(పం్‌పహౌ్‌స)లో రా వాటర్ పంప్స్, హైలిఫ్ట్ పంప్స్, కెమికల్ డోసింగ్ పంప్స్, ఫ్లాష్ మిక్సర్, ఫ్లాక్యూలేటర్, క్లారిఫయర్, ఫిల్డర్ పంప్స్, క్లోరినేషన్ సిస్టమ్, వాటర్ క్వాలిటి సెన్సర్స్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలకు నిరంతరాయంగా, నాణ్యమైన నీటిని అందించేందుకు నీటి శుద్ధి కేంద్రంలోని అన్ని యంత్రాలు పూర్తి సామర్ద్యంతో పనిచేసేలా చూడాలన్నారు. మరమ్మతు అవసరమైన యంత్రాలను గుర్తించి వెంటనే మరమ్మతు చేయాలన్నారు. నీటి శుద్ధి ప్రక్రియలో ఎక్కడా లోపాలు లేకుండా నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో నీటి సరఫరా సమయాలను సమీక్షించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ జే.రమణమూర్తి, డీఈఈ నరేష్, ఏఈలు జనార్దన్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.