స్వచ్ఛ నగరాలే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:11 AM
స్వచ్ఛ నగరాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ నగరాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శనివారం ‘స్వచ్ఛాంరఽధ- స్వర్ణాంధ్ర’లో భాగంగా 21వ వార్డు సంస్కృతి పార్క్‌లో మున్సిపల్ కార్మికులతో కలిసి ఆమె పరిసరాలను పరిశీలించారు. గౌరు చరిత మాట్లాడుతూ కాలనీల్లో పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకో వాలని, ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూడాలన్నారు. అనంతరం అధికారులు, నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎస్‌కె. శ్రీనివాసరావు, పల్లె రఘునాథ్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి, విశ్వనాథ్, భరతనాయక్, వెంకటేష్ చౌదరి, రాఘవేంద్రారెడ్డి, మారెన్న, హరి పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరిస్తాం: పాణ్యం నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శనివారం మాధవీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీక రించారు. గౌరుచరిత మాట్లాడుతూ వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కాలనీలో అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫోనలో ఆదేశాలిచ్చారు.