Share News

నగరవనం సుందరం..

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:44 PM

పట్టణ వాసులకు ఉల్లాసం కలిగించేందుకు ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో గుత్తిరోడ్డులో నగర వనాన్ని అభివృద్ధి చేసింది. ఇటీవలే ఎమ్మెల్యే కోట్ల నగర వనాన్ని ప్రారంభించారు. దాదాపు 115 ఎకరాల విస్తీర్ణంలో రూ.2 కోట్లతో దీన్ని నిర్మింయారు.

 నగరవనం సుందరం..
ద్రోణాచల నగరవనం ముఖద్వారం

రూ.2కోట్లతో అభివృద్ధి చేసిన ప్రభుత్వం

డోన్‌ రూరల్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): పట్టణ వాసులకు ఉల్లాసం కలిగించేందుకు ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో గుత్తిరోడ్డులో నగర వనాన్ని అభివృద్ధి చేసింది. ఇటీవలే ఎమ్మెల్యే కోట్ల నగర వనాన్ని ప్రారంభించారు. దాదాపు 115 ఎకరాల విస్తీర్ణంలో రూ.2 కోట్లతో దీన్ని నిర్మింయారు.

పట్టణవాసుల సౌకర్యార్థం..

డోన్‌ పట్టణం, చుట్టుపక్కన ప్రాంతాల వాసులకు ఆహ్లాదం కలిగించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించారు. పెద్దలు సేదదీరేందుకు అలాగే పిల్లలు ఆడుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక వాకింగ్‌ ట్రాక్‌, ఇరువైపులా మొక్కలు, ఫినిషింగ్‌, పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలాలు ఉన్నాయి. అలాగే వ్యాయామం కోసం జిమ్‌, విశ్రాంతి భవనం, నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌, నక్షత్ర వనాలు, విశ్రాంతి కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు. అలాగే గ్రీన్‌ కార్పెట్‌ కింద 2,222 మొక్కలను నాటడంతో పచ్చదనంతో నగర వనం కళకళలాడుతోంది. నగర వనంలోకి ప్రవుశం కోసం పిల్లలకు రూ.10, పెద్దలకు రూ.20 ధర నిర్ణయించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడిపేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.

మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం

నూతనంగా అభివృద్ధి చేసిన నగరవనం పట్టణ ప్రజలు, పిల్లలకు ఉపయోగకరంగా ఉంది. మరింతగా అభివృద్ధి చేసి, సౌకర్యాలు కల్పిస్తాం. - ప్రవీణ్‌ కుమార్‌, ఫారెస్ట్‌ రేంజర్‌

Updated Date - Jul 26 , 2026 | 11:51 PM