Share News

బిల్వ స్వర్గం గుహల్లో సినిమా షూటింగ్‌

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:16 AM

మండలంలోని కేకే కొట్టాల సమీపంలో ఉన్న బిల్వ స్వర్గం గుహల్లో విజయ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రణబలి’ సినిమా సన్నివేశాలను మంగళవారం చిత్రీకరించారు.

బిల్వ స్వర్గం గుహల్లో సినిమా షూటింగ్‌
దర్శకుడు రాహుల్‌ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న విజయ దేవరకొండ

బేతంచెర్ల, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కేకే కొట్టాల సమీపంలో ఉన్న బిల్వ స్వర్గం గుహల్లో విజయ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రణబలి’ సినిమా సన్నివేశాలను మంగళవారం చిత్రీకరించారు. సోమవారం నుంచి ప్రారంభమైన షూటింగ్‌ గురువారం వరకు కొనసాగనుంది. దర్శకుడు రాహుల్‌ జన్మదిన వేడుకలను సోమవారం సాయంత్రం బిల్వ స్వర్గం గుహల సమీపంలో విజయ్‌ దేవరకొండ సమక్షంలో సినీ పరిశ్రమ సిబ్బంది నిర్వహించారు. సినీ నటి రష్మిక మందనతో పలు సన్నివేశాలు మరో రెండు రోజుల పాటు బిల్వ స్వర్గం గుహల్లోనే చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. సిఐ వెంకటేశ్వరరావు ఆఽధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు

Updated Date - Jul 01 , 2026 | 12:16 AM