Share News

మరణాన్ని జయించిన క్రీస్తు

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:43 PM

: క్రీస్తు మరణాన్ని జయించారని కర్నూలు ఆర్‌సీఎం డయోసిస్‌ బిషప్‌ డాక్టర్‌ గోరంట్ల జ్వాన్నేష్‌ ఉద్బోధించారు.

మరణాన్ని జయించిన క్రీస్తు
ప్రార్థనలు నిర్వహిస్తున్న బిషప్‌ గోరంట్ల జ్వాన్నేష్‌

ఆర్‌సీఎం కర్నూలు డయోసిస్‌ బిషప్‌ డాక్టర్‌ గోరంట్ల జ్వాన్నేష్‌

నగరంలోని చర్చిల్లో ఘనంగా ‘ఈస్టర్‌’

కర్నూలు కల ్చరల్‌, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): క్రీస్తు మరణాన్ని జయించారని కర్నూలు ఆర్‌సీఎం డయోసిస్‌ బిషప్‌ డాక్టర్‌ గోరంట్ల జ్వాన్నేష్‌ ఉద్బోధించారు. ఈస్టర్‌ను ఆదివారం నగరంలోని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఆయా చర్చిల్లో మతపెద్దలు దైవ ప్రార్థనలు చేసి, ఈస్టర్‌ వేడుకలోని సారాంశ సందేశాన్ని తెలియజే శారు. నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోగల లూర్ధుమాత కేథడ్రిల్‌ (బిషప్‌ చర్చి)లో శనివారం అర్థరాత్రి నుంచే ఈస్టర్‌ వేడు కలు ఆరంభయ్యాయి. ఆదివారం ఉదయం నగరంలోని చిల్డ్రన్స పార్కు వద్ద గల పెద్ద థెరీసమ్మ దేవాలయంలో ఈస్టర్‌ ప్రార్థనలు నిర్వహించారు. వేడుకలో భాగంగా, సంప్రదాయంగా నూతన అగ్నిని, జలమును ఆశీర్వదించారు. ఆయన దైవ సందేశం ఇస్తూ మరణాన్ని జయించిన క్రీస్తు మనకు నూతన జీవితాన్ని ప్రారంభించమని ప్రబోధించారని చెప్పారు. ఈ సందర్భంగా బిషప్‌ ప్రభువు భోజనాన్ని భక్తులకు అందజేశారు. కర్నూలు డయోసిస్‌ డీన ఫాదర్‌ జాన డేవిడ్‌, ఫాదర్లు జోజిరెడ్డి, ప్రతాపరెడ్డి, ప్రభుదాస్‌, రాజశేఖర్‌, మనోహర్‌, సిస్టర్లు, క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.

సందడి

నగరంలో ఈస్టర్‌ వేడుకల సందడిబాగా కనిపించింది. పిల్లల పార్కు సమీపంలోని ఎస్‌పీజీ (సీఎస్‌ఐ) చర్చిలో జరిగిన పురరుత్తాన వేడుకల్లో సంఘ పెద్దలు ఈస్టర్‌ వేడుక సందేశాన్ని తెలియజేశారు. ఎస్‌పీజీ (సీఎస్‌ఐ) నంద్యాల డయోసిస్‌ బిషప్‌ సంతోష్‌కుమార్‌ హాజరై దైవ సందేశం ఇచ్చారు. కోట్ల సర్కిల్‌లోని కోల్స్‌ సెంటీనియల్‌ తెలుగు బాప్టిస్టు చర్చిలో జరిగిన సూర్యోదయ ఆరాధన కార్యక్ర మంలో దైవ సందేశాన్ని కోల్స్‌ పాస్టర్‌ రెవ. అనిల్‌ శామ్యూల్‌ తెలి యజేశారు. యోహోవా షమ్మా చర్చిలో డాక్టర్‌ ఆర్‌ ప్రశాంతి శ్యామ్‌ దైవ సందేశాన్ని తెలియజేశారు. సి.క్యాంపులోని ప్రార్థన మందిరం చర్చిలో, రెవెన్యూ కాలనీలోని హోసన్న మందిరంలో, యోరోషలేం మందిరంలో, హోరేబు టెంపుల్‌ తదితర చర్చిలలో జరిగిన ఈస్టర్‌ వేడుకల్లో ఆయా చర్చిల పాస్టర్లు, మత పెద్దలు ఈస్టర్‌ ప్రాము ఖ్యతను వివరించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Updated Date - Apr 05 , 2026 | 11:43 PM