చితికిపోతున్నారు..!
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:03 AM
చీనీ తోటలు సాగుచేసిన రైతులు ఆర్థికంగా చితికిపోతు న్నారు. నాలుగేళ్ల నుంచి చీనీకి తెగుళ్ల బెడద అధికమైంది. వీటిని అదుపు చేసేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టినా అదుపులోకి రాకపోవ డంతో పాటు పంట దిగుబడులపై ప్రభావం పడింది.
నిలువునా ఎండుతున్న చీనీ చెట్లు
భారీగా తగ్గిన దిగుబడులు
తగ్గిపోయిన ధరలు
చెట్లను తొలగిస్తున్న రైతులు
జిల్లాలో 1,400 ఎకరాల్లో చీనీ సాగు
చాగలమర్రి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): చీనీ తోటలు సాగుచేసిన రైతులు ఆర్థికంగా చితికిపోతు న్నారు. నాలుగేళ్ల నుంచి చీనీకి తెగుళ్ల బెడద అధికమైంది. వీటిని అదుపు చేసేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టినా అదుపులోకి రాకపోవ డంతో పాటు పంట దిగుబడులపై ప్రభావం పడింది. పురుగు, తెగుళ్ల మందులు, ఎరువులు, కూలీల ఖర్చు పెరిగి రైతుకు భారంగా మారింది. తెగుళ్లతో చెట్లు నిలువునా ఎండుతున్నాయి. చీనీ కాయల ధరలు కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఆదాయం కంటే పెట్టుబడులు ఎక్కువ కావడంతో రైతులు చీనీ తొలగిస్తున్నారు. నంద్యాల జిల్లాలో 1,400 ఎకరాల్లో చీనీ తోటలు సాగుచేశారు. బనగానపల్లెలో 600 ఎకరాలు, నందికొ ట్కూరులో 92, డోన్‌లో 104, పాణ్యంలో 20, నంద్యాలలో 22, చాగలమర్రిలో 84, ఆళ్లగడ్డలో 20, ఉయ్యాలవాడలో 65, రుద్రవరం 63 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
ప్రస్తుతం టన్ను రూ.20వేలు
చీనీ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. టన్ను రూ.20వేలు పలుకుతోంది. వ్యాపా రులు పొలం వద్దకు వచ్చి ఇంత తక్కువ ధర చెప్పడంతో కాయలు అమ్మాలో లేదో తెలియక కొందరు రైతులు దిగాలు చెందు తున్నారు. రెండు నెలల క్రితం వరకు ధరలు పెరుగు తూ వచ్చాయి. టన్ను రూ.50వేలు కూడా పలికింది. ఇరాన్, ఇజ్రాయె ల్ యుద్ధప్రభావంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ధర రూ.20వేలకు పడిపోయింది. ఎగుమతులు జరుగకపోవడంతో ధరలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం నష్టాలబాట పట్టిన చీనీ రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని, రాయితీలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
నాలుగెకరాల్లో చీనీ తోట సాగుచేశా
నాలుగెకరాల్లో చీనీ తోట సాగుచేశా. ఎనిమిదేళ్ల పాటు పంటను కాపాడుకుంటూ వచ్చా. దిగుబడి వచ్చే సమయానికి ధర లేదు. ధరలు తగ్గడంతో వ్యాపారులు ముం దుకు రావడం లేదు. తీవ్రంగా నష్టపోతున్నా. తెగుళ్లతో చెట్లు కూడా దెబ్బతింటు న్నాయి. పెట్టుబడి రాకపోవడంతో చీనీ చెట్లను తొలగిస్తున్నా. చిన్న సంజీవరెడ్డి, రైతు, కొలుములపేట, చాగలమర్రి
చీనీ చెట్లను తొలగించేశా
ఐదెకరాల్లో చీనీ తోటను సాగుచేశా. ధరలేక పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరి స్థితి లేదు. ఎండలకు కాయలు దెబ్బతిని నల్లబారుతున్నాయి. చెట్లకు కాపు రావడం లేదు. దిగుబడి లేకపోవడంతో చెట్లను తొలగించేసి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నా. సంజీవరెడ్డి, రైతు, చాగలమర్రి