Share News

ఛైన్‌ స్నాచింగ్‌ కేసులో నిందితుడి అరెస్టు

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:53 PM

పలు రాష్ట్రాల్లోని పోలీసులకు చుక్కలు చూపిస్తున్న భవారియా గ్యాంగ్‌లోని ముఠా సభ్యుడి కర్నూలు నాలుగో పట్టణ పో లీసులు చాకచక్యంగా అరెస్టు చేసినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు.

ఛైన్‌ స్నాచింగ్‌ కేసులో నిందితుడి అరెస్టు
నిందితుడిని చూపుతున్న పోలీసులు

భవారియా గ్యాంగ్‌లోని ముఠా సభ్యుడు

కర్నూలు క్రైం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): పలు రాష్ట్రాల్లోని పోలీసులకు చుక్కలు చూపిస్తున్న భవారియా గ్యాంగ్‌లోని ముఠా సభ్యుడి కర్నూలు నాలుగో పట్టణ పో లీసులు చాకచక్యంగా అరెస్టు చేసినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు. వివరాలు.. ఈ నెల 8వ తేదీ రాత్రి గుత్తి పెట్రోల్‌ బంకు సమీపంలో ఉన్న సాయినాథ్‌ నగర్‌లో ఓ మహిళ మెడలో నుంచి బైక్‌పై వచ్చిన ఆగంతకులు గొలుసును తెంపుకుని ఉడా యించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సంతో్‌షనగర్‌లో ఉన్న నాగమణి అనే వృద్దురాలు తన ఇంటి బయట కూర్చుని ఉండగా.. ఆ ఇద్దరు వ్యక్తులే వచ్చి గొలుసును తెంపు కుని పరారయ్యే ప్రయత్నించారు. ఆ మహిళా కేకలు వేయడంతో స్థానిక కాలనీ వాసులు, బందువుల అప్రమత్తమై బైక్‌పై వచ్చిన ఆ ఇద్దరు దొంగలను గమనించారు. కాలనీలో టర్నింగ్‌లు ఎక్కువగా ఉండటంతో బైక్‌ను తిప్పుకోలేక ఇద్దరు కిందపడి పోయారు. వెంటనే బైక్‌ను అక్కడే వదిలేసి చెరోదిక్కున పరారయ్యారు. ఈ రెండు సంఘటనలో అప్రమత్తమైన నాలుగోపట్టణ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి స్థానికులు ఇచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టారు. మురళి, సుభ్బరాయుడు అనే హెడ్‌ కానిస్టేబుల్స్‌ ఈవిషయంపై తనిఖీలు చేస్తుండగా.. ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. ఆ యువకుడిని ప్రశ్నించగా.. ఆ యువకుడు తడబడుతూ హిందీలో సమాధానం ఇచ్చారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ యువకుడిని సీఐ వద్దకు చేర్చారు. సీఐ ఆయువకుని జేబులో తనిఖీలు చేయగా బైక్‌లు చోరీ చేసేం దుకు ఉపయోగించే చిన్నపాటి కత్తిని గుర్తుపట్టారు. నిందితున్ని తనదైన శైలిలో ప్రశ్నిస్తే నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నారు. కర్నూలులో ఆరోజే రెండు చోట్ల స్నాచింగ్‌లు చేశామని, ఆ రెండు గొలుసులు కూడా పరారైన మరో వ్యక్తి హరిప్రకాష్‌ దగ్గర ఉన్నట్లు చెప్పారు. హరిప్రకాష్‌ కోసం గాలించగా.. ఫలితం దక్కలేదు. స్నాచింగ్‌కు పాల్పడిన నిందితులు ఇద్దరు మానవ్‌, హరిప్రకా్‌షలు భవారియా ముఠా గ్యాంగ్‌ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 7వ తేదీన ఇద్దరు కూడా బెంగుళూరు వచ్చి అక్కడి నుంచి అనంతపురం వచ్చినట్లుగా గుర్తించారు.

Updated Date - Apr 21 , 2026 | 11:57 PM