‘బాలలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి’
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:11 AM
బాలలు సత్పవర్తనను అలవర్చుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) పి.వాసు అన్నారు.
కర్నూలు లీగల్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): బాలలు సత్పవర్తనను అలవర్చుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) పి.వాసు అన్నారు. శుక్రవారం స్థానిక బి.క్యాంపులోని బాలుర పరిశీలన గృహంలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలల సంక్షేమానికి ప్రభుత్వాలు పలు చట్టాలు తెచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బాలలకు సంబంధించిన చట్టాలను, ఉచిత న్యాయ సహాయం గురించి బాలలకు వివరించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ బాలల సంక్షేమం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 15100కు ఫోన చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బాలలకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన బాలలకు జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) పి.వాసు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జువైనల్ జస్టిస్ బోర్డు న్యాయాధికారి అపర్ణ, మెంబర్ సునీత, డీపీవో దివాకర్, పరిశీలన గృహం సూపరింటెండెంట్ హుశేనబాషా, సీడబ్లూసీ చైర్మన ప్రవీణ్ కుమార్, జ్యువైనల్ జస్టిస్ బోర్డు ప్రాసిక్యూటర్ పద్మజ పాల్గొన్నారు.
పంచలింగాలలో: స్థానిక పంచలింగాల గ్రామంలోని ఏపీ రెసిడె న్షియల్ స్కూల్ (మైనార్టీ బాలికలు)లో సురక్షిత బచపన అభియాన కార్యక్రమంపై శుక్రవారం ఓ అవగాహన సదస్సు జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి బాలల హక్కులు, భద్రత వారి హక్కులు, లైంగిక నేరాలపై బాలికలకు అవగాహన కల్పిం చారు. వేధింపులకు గురైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఫిర్యాదు చేసే విధానాలు ఉచిత న్యాయ సహాయం తదితర అంశాలపై బాలికలకు అవ గాహన కల్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స కౌన్సిల్ సులోచన, లీగల్ ఎయిడ్ మెంబర్ డా.రాయపాటి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు సీతా పాల్గొన్నారు.