పిల్లలను బడిలో చేర్చాలి: కలెక్టర్
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:06 AM
బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్చేలా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికా రులను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు.
కర్నూలు ఎడ్యుకేషన్, జూన 30(ఆంధ్రజ్యోతి): బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్చేలా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికా రులను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యా లయ సమావేశ మందిరంలో పాఠశాల విద్యకు సంబంధించిన కీలక అం శాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశా నికి ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు కే.శ్రీనివాసులరెడ్డి, కడప ప్రాంతీయ సంయుక్త విద్యాశాఖ సంచాలకులు కే.శామ్యూల్, కేపీఎంజీ కన్సల్టెంట్ ఆర్‌ఎస్‌ఎన శర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.సుధాకర్, సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త (ఏపీసీ) ఎనబీ లోక్‌రాజు, ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు, జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో విద్యార్థుల నమోదు, బడి బయట ఉన్న పిల్లల గుర్తింపు, పాఠశాలల్లో చేరుట, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం (ఎఫ్‌ఎల్‌ఎన) కార్యక్రమం అమలు, పాఠశాలల మౌలిక వసతుల లోపాల పరి ష్కారం పాఠశాల తనిఖీలు, సమాజ భాగస్వామ్యం, పదో తరగతి ఫలితాల మెరు గుదల తదితర అం శాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల నమోదు శాతాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలన్నారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.