Share News

అనాథలుగా మిగిలిన చిన్నారులు

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:30 AM

పట్టణంలోని పాలసాగరం కాలనీకి చెందిన అబ్దుల్లా(37) సోమవారం గుండెపోటు తో మృతిచెందాడు. వివరాల మేరకు.. అబ్దుల్లా, నసీమూన్‌కు తస్లిం(10), సోఫియా(9) అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు కూలిపనులకు వెళ్లి తమ పిల్లలను పెంచుకుంటు చదివించుకొంటున్నారు.

అనాథలుగా మిగిలిన చిన్నారులు
తండ్రి మృతదేహం వద్ద చిన్నారులు

గుండెపోటుతో తండ్రి మృతి

గతేడాది మృతిచెందిన తల్లి

ఆళ్లగడ్డ, సెప్టెంబరు7(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాలసాగరం కాలనీకి చెందిన అబ్దుల్లా(37) సోమవారం గుండెపోటు తో మృతిచెందాడు. వివరాల మేరకు.. అబ్దుల్లా, నసీమూన్‌కు తస్లిం(10), సోఫియా(9) అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు కూలిపనులకు వెళ్లి తమ పిల్లలను పెంచుకుంటు చదివించుకొంటున్నారు. గతేఏడాది తల్లి నసీమూన్‌ అనారోగ్యంతో మృతి చెందిం ది. అప్పటి నుంచి అన్నీ తానై వారిని పెం చాడు. అయితే సోమవారం తండ్రి మృతిచెందడంతో ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మిగిలారు. తండ్రి మృతదేహం వద్ద ఇద్దరు చిన్నారుల రోదనలు కంటతడి పెట్టించాయి. బంధువులు ఎవరూ లేకపోవడంతో కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. దాతలు పిల్లలను ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Sep 08 , 2026 | 12:30 AM