Share News

బోసినవ్వులు మాయం

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:51 PM

ఆ దంపతులకు వివాహమై నాలుగేళ్లు. తొలికాన్పులో ఆడబిడ్డ పుట్టింది. ఇంటిల్లిపాది ఆనందించారు. పాప బుడిబుడి అడుగులు వేయడం ప్రారంభించింది. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వారి సంతోషాలు ఎక్కువ కాలం నిలవలేదు. ఇక బుడిబుడి అడుగులు.. బోసి నవ్వులు ఆ కుటుంబానికి దూరమైపోయాయి. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన వయస్సులోనే ఆచిన్నారి అనంతలోకాలకు చేరింది.

బోసినవ్వులు మాయం
మృతి చెందిన చిన్నారి

మిద్దె కూలీ చిన్నారి దుర్మరణం

నాయనమ్మకు గాయాలు

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

గడివేముల, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఆ దంపతులకు వివాహమై నాలుగేళ్లు. తొలికాన్పులో ఆడబిడ్డ పుట్టింది. ఇంటిల్లిపాది ఆనందించారు. పాప బుడిబుడి అడుగులు వేయడం ప్రారంభించింది. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వారి సంతోషాలు ఎక్కువ కాలం నిలవలేదు. ఇక బుడిబుడి అడుగులు.. బోసి నవ్వులు ఆ కుటుంబానికి దూరమైపోయాయి. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన వయస్సులోనే ఆచిన్నారి అనంతలోకాలకు చేరింది. మిద్దె రూపంలో మృత్యు కబళించి కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. ఈ హృదయ విదారక ఘటన నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని బూజనూరు గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కురువ నాగమణి, కురువ వెంకటేశ్వర్లు దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె నితీష(18 నెలలు) ఉంది. అ ప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ బుడి బుడి అడుగులతో అందరిని అలరిస్తున్న ఆచిన్నారి ఇంట్లో ఆడుకుంటూ ఉంది. నాయనమ్మ సుబ్బమ్మ స్నానానికి వెళ్లగా ఇంట్లో చిన్నారి ఆడుతూ తిరుగుతూ ఉంది. ఇంతలో పాత మిద్దె కూలిపడింది. చిన్నారిపై మట్టిపడటంతో అక్కడికక్కడే మరణించింది. కాగా నాయనమ్మ సుబ్బమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. నిన్నటి వరకు ఇంట్లో చిరునవ్వులు పంచిన పసిపాప నేడు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బూజనూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Oct 10 , 2026 | 11:51 PM