Share News

రాఘవేంద్రుని సన్నిధిలో ప్రధాన న్యాయాధికారి

ABN , Publish Date - May 03 , 2026 | 11:03 PM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు.

రాఘవేంద్రుని సన్నిధిలో ప్రధాన న్యాయాధికారి
ప్రదక్షిణ చేస్తున్నప్రధాన న్యాయాధికారి కబర్ధి

మంత్రాలయం, మే 3(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ముఖద్వారం వద్ద ఆయనకు మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, సురేష్‌కోణాపూర్‌, శ్రీపతి ఆచార్‌, ఐపీ నరసింహమూర్తి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేసి రథోత్సవాల ఊరేగింపులో పాల్గొన్నారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు రాఘవేంద్రస్వామి మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో అనంతపు రాణిక్‌, మంత్రాలయం సీఐ దస్తగిరిబాబు, జయ తీర్థఆచార్‌, వ్యాసరా జాచార్‌, జేపీ స్వామి, రంగస్వామి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2026 | 11:03 PM