ఎరువుల దుకాణాల్లో తనిఖీ
ABN , Publish Date - May 06 , 2026 | 11:44 PM
నంద్యాల జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలను కేంద్ర బృందం సభ్యులు బుఽధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నంద్యాల ఎడ్యుకేషన్, మే 6 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలను కేంద్ర బృందం సభ్యులు బుఽధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్ర బృందం సభ్యులైన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ రవీంద్రయాదవ్, ఎక్సెటెన్షన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ మధుశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లాలోని పలు ఎరువులు, పురుగుల మందుల దుకాణాలను తనిఖీ చేశారు. యూరియా, డీఏపీ నిల్వలు, ఈపోస్ మిషన్ ద్వారా రైతులకు ఎరువుల సరఫరా చేసే విధానాన్ని పరిశీలించారు. మూడేళ్ల నుంచి యూరియా, డీఏపీ అమ్మకాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ యూరియా, డీఏపీ అవసరం మేరకు మాత్రమే వాడాలని, మోతాదుకు మించి వాడడం వల్ల భూసారం దెబ్బతిని భవిష్యత్‌లో పంటలు సాగుచేయడం కష్టమవుతుందని అన్నా రు. రైతులు 30 రకాల విత్తనాలు కల్గిన పీఎండీఎస్ కిట్లను సాగుచేయ డం అలవాటు చేసుకోవాలని, నానో, జీవన ఎరువులను ఉపయోగించాలన్నారు. అధిక ఎరువుల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అన్ని మండలాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు.