బ్లాక్ మనీ పేరుతో మోసం
ABN , Publish Date - May 24 , 2026 | 12:22 AM
: బ్లాక్ మనీ పేరుతో రూ.లక్ష ఇస్తే రూ. మూడు లక్షలు ఇస్తానని డబ్బు ఆశ చూసి మోసం చేసిన ఘటన క్రిష్ణగిరి మండలంలో చోటుచేసుకుంది. శనివారం వెల్దుర్తి సర్కిల్ కార్యాలయంలో సీఐ యుగంధర్ క్రిష్ణగిరి ఎస్‌ఐ మల్లికార్జునతో కలిసి విలేకర్ల సమావేశంలో ఈ విషయం తెలిపారు.
రూ. లక్షకు రూ. 3 లక్షల ఆశ చూపి..
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వెల్దుర్తి, మే 23(ఆంధ్రజ్యోతి): బ్లాక్ మనీ పేరుతో రూ.లక్ష ఇస్తే రూ. మూడు లక్షలు ఇస్తానని డబ్బు ఆశ చూసి మోసం చేసిన ఘటన క్రిష్ణగిరి మండలంలో చోటుచేసుకుంది. శనివారం వెల్దుర్తి సర్కిల్ కార్యాలయంలో సీఐ యుగంధర్ క్రిష్ణగిరి ఎస్‌ఐ మల్లికార్జునతో కలిసి విలేకర్ల సమావేశంలో ఈ విషయం తెలిపారు. వివరాలు... ఈనెల 15వ తేదీన క్రిష్ణగిరి మండలం ఆగవేళి గ్రామానికి చెందిన వీరేశ్ అనే వ్యక్తికి సి. బెళగల్ మండలం బేతోలి గ్రామానికి చెందిన గొల్ల వెంకటేశ్ బ్లాక్ మనీ పేరుతో డబ్బు ఆశ చూపి మోసం చేశాడు. రూ.1లక్ష తీసుకొని అతనికి రూ.3లక్షల బ్లాక్ మనీ ఇచ్చాడు. వీరేశ్ ఇంటికి వెళ్లి చూసుకోగా మోసపోయానని గమనించి క్రిష్ణగిరి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ క్రిష్ణమూర్తి 20వ తేదీన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 22వ తేదీ వెల్దుర్తి సమీపాన జాతీయ రహదారి-44 చెరుకులపాడు రోడ్డులో ఉన్న ఊరుకుంద ఈరన్నస్వామి దేవాలయం వద్ద తచ్చాడుతుండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.2లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రిమాండ్ నిమిత్తం డోన్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐ యుగంధర్ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులను నమ్మొద్దని అన్నారు.