ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదు
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:32 AM
పేదలకు అన్నంపెట్టే జాతీయ మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం పేరును మార్చాలని చూడడం సరైందికాదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కాశింవలి, ఎనఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు వీరేష్‌యాదవ్ అన్నారు.
ఎమ్మిగనూరు రూరల్, జనవరి 13(ఆంధ్రజ్యోతి): పేదలకు అన్నంపెట్టే జాతీయ మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం పేరును మార్చాలని చూడడం సరైందికాదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కాశింవలి, ఎనఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు వీరేష్‌యాదవ్ అన్నారు. మంగళవారం స్థానిక గాంధీ సర్కిల్‌లో కళ్లకు గంతులు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేద, బడుగు, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఎన్నో చట్టాలను తీసుకు వచ్చిందన్నారు. కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. ప్రస్తుతం నిరుపేద ప్రజలకు అన్నం పెట్టే ఉపాధిహామీ పథకం పేరును మార్చాలని కుట్రపన్నుతుంద న్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకో వాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షబ్బీర్, నరస ప్ప, పెద్దకాశిం, ముస్తఫా, జైపాల్, శేషాద్రి, లోకేష్, రఫిక్ పాల్గొన్నారు.