Share News

టెట్‌లో మార్పులు చేయాలి

ABN , Publish Date - Aug 25 , 2026 | 11:01 PM

ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్‌లో మార్పులు చేసి మినహాయించాలని, అవసరమైతే ప్రత్యేక సవరణలు చేయాలని యూటీ ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌, రాష్ట్ర సహాధ్యక్షుడు సురే్‌షకుమార్‌ డిమాండ్‌ చేశారు.

టెట్‌లో మార్పులు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్‌లో మార్పులు చేసి మినహాయించాలని, అవసరమైతే ప్రత్యేక సవరణలు చేయాలని యూటీ ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌, రాష్ట్ర సహాధ్యక్షుడు సురే్‌షకుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ఆయూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిం చాలన్నారు. అర్హత మార్కులు ఒకే విధంగా ఉండాలన్నారు. ప్రత్యేక టెట్‌ నోటిఫికేషన్‌లో ఉపాధ్యాయులకు వారి వారి సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలన్నారు. అర్హత పర్సేంటేజి తగ్గించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నవీన్‌పాటి, హేమంత్‌కుమార్‌, యేహోషువా, సర్వేశ్వర్‌ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 11:01 PM