Share News

పల్లె పండుగతో విప్లవాత్మక మార్పు

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:21 AM

కూటమి ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. పల్లె పండుగ-3.0 వారోత్సవాలను భాగంగా మంగళవారం ఓర్వకల్లులో పనులను ఘనంగా ప్రారంభించారు.

పల్లె పండుగతో విప్లవాత్మక మార్పు
ఓర్వకల్లులో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

అభివృద్ధిలో దూసుకుపోతున్న పాణ్యం నియోజకవర్గం

రూ.37.97 కోట్లతో అభివృద్ధి పనులు

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఓర్వకల్లు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. పల్లె పండుగ-3.0 వారోత్సవాలను భాగంగా మంగళవారం ఓర్వకల్లులో పనులను ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఓర్వకల్లులోని కెనరా బ్యాంకు నుంచి మండల పరిషత్‌ పాఠశాల వరకు ఉపాధి నిధులు రూ.20 లక్షలు, చరితమ్మ నగర్‌లో రూ.10 లక్షలతో సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబ, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం పల్లెపండుగ-3.0 కార్యక్రమం కింద అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. ఓర్వకల్లు మండలానికి పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రూ.6.43 కోట్లు అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. పల్లె పండుగ 3.0లో మరో రూ.2.30 కోట్లతో పనులు మంజూరయ్యాయని అన్నారు. అనంతరం సబ్సిడీపై పప్పుశనగ, గడ్డి విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ జయచంద్రారెడ్డి, ఈఈ శివసాగర్‌ రెడ్డి, డీఈ శ్రీదేవి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, ఏపీడీ పద్మావతి, తహసీల్దార్‌ విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:21 AM