Share News

విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:30 PM

విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు.

విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం
నివాళి అర్పిస్తున్న జేసీ నూరుల్‌ ఖమర్‌

జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం

ఎంపీ బస్తిపాటి నాగరాజు

ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. శనివారం జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్బంగా నగరంలోని బిర్లాగేటు సర్కిల్‌లో జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీబీసీ డబ్లూవో ప్రసూన అధ్యక్షతన జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. పూలే విగ్రహానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు, జేసీ నూరుల్‌ ఖమర్‌, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, బీసీ, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అక్కడే ఏర్పాటు చేసిన సభనుద్దేశించి ఎంపీ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమన్నారు. పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జేసీ నూరుల్‌ ఖమర్‌ మాట్లాడుతూ పూలే సమాజ హితానికి నిరంతరం కృషి చేస్తూ, మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం పోరాటం చేశారన్నారు. కురువ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవేంద్రప్ప, డైరెక్టర్‌ కే.రామకృష్ణ, బీసీ జాతీయ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, కుమ్మర శాలివాహన కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పీబీవీ సుబ్బయ్య, కురువ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పర్ల శ్రీను, బీసీ కార్పొరేషన్‌ ఈడీ జాకీర్‌ హుశేన్‌, వాల్మీకి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మంజునాథ్‌, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల లక్ష్మీకాంతయ్య, మాజీ జడ్పీ చైర్మన్‌ బత్తిన వెంకట్రాముడు, విద్యాసంస్థల చైర్మన్‌ కేవీ సుబ్బారెడ్డి, శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగన్న, బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర అద్యక్షులు ధనుంజయాచారి, రజక సంఘం అధ్యక్షులు వాడాల నాగరాజు, బీసీ సంఘం కన్వీనర్‌ నాగేష్‌, వివిధ కుల సంఘాల నాయకులు మాజీ అధ్యక్షులు సుగూరు వెంకటేశ్వర్లు, మురళి, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 11:31 PM