Share News

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:37 AM

జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
విఠల్‌ నగర్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత

టీడీపీ శ్రేణుల సంబరాలు

జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.

కల్లూరు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిం చాయి. సోమవారం సీఎం పుట్టిన రోజును పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గౌరు చరిత , నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సీబీఎన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చంద్ర బాబు జన్మదినం రోజున నారా భువనేశ్వరి సహకారంతో కల్లూరు ఏస్టేట్‌లోని అన్నక్యాంటీనలో చేపట్టిన అల్పాహార పంపిణీలో గౌరు చరిత, నంద్యాల చెక్‌పోస్టులోని అన్న క్యాంటీనలో గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు.

ఫ 26, 27 వార్డు విఠల్‌ నగర్‌లో టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జి చరణ్‌కుమార్‌ యాదవ్‌ సమక్షంలో ఎమ్మెల్యే గౌరు చరిత కేక్‌కట్‌ చేశారు. కాలనీలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్ర మంలో ఏపి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన చైర్‌పర్సన కె.పార్వతమ్మ, డైరెక్టర్‌ ఎస్‌కే.శ్రీనివాసరావు, నంద్యాల జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి చిన్నమా రెన్న, 10వ క్లస్టర్‌ ఇనచార్జి పియూ.మాదన్న, ఎన్వీ.రామకృష్ణ, జి.గంగాఽ దర్‌గౌడ్‌, రవి ప్రకాష్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మెన పెరుగు పురుష్తోత్తంరెడ్డి, ఓర్వకల్లు టీడీపీ ఇనచార్జి బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, ప్రభా కర్‌యాదవ్‌ పాల్గొన్నారు.

కోడుమూరు: జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాల యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరై కేక్‌ కట్‌ చేశారు. దస్తగిరి మాట్లాడుతూ చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడని అన్నారు. కార్యక్రమంలో దివ్యాంగులు సురేష్‌నాయుడు, రాజశేఖర్‌, రుబీనా, కృష్ణవేణి, పద్మక్క, మాదన్న, సాగర్‌, టీడీపీ నాయ కులు మాజీ జడ్పీటీసీ ముగుమలగుర్తి విష్ణువర్థన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, గంగాధర్‌, మాలమహానాడు మునిస్వామి, గోపాల్‌నాయుడు, బడెసాగౌడ్‌, రవీంద్రగౌడ్‌, మధు, ఎల్లప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు.

కోడుమూరు రూరల్‌: మండలంలోని లద్దగిరిలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు పట్టె మధు అధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచి పెట్టారు. కోఆపరేటివ్‌ సొసైటీ చైర్మన పట్టె కృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు తన రాజకీయ జీవితంలో అభివృద్ధే ధ్యేయం గా అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.

కర్నూలు అర్బన్‌: గత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల పొట్ట కొట్టిందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా నగరంలోని పాతబస్టాండ్‌ వద్ద ఉన్న అన్న క్యాంటీనలో నిర్వహించిన ఉచిత అన్నదాన కార్యక్రమంలో కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కర్నూలు లీగల్‌: చంద్రబాబు విజినరీ లీడర్‌ అని టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని అన్నారు. టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు బార్‌ అసోసియేషన కార్యాలయంలో చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రంగ రవికుమార్‌, న్యాయవాదులు శంకర్‌సింగ్‌, రవికుమార్‌, సురేంద్ర గౌడు, రవిరాజు, రామదాసు, మధన రెడ్డి పాల్గొన్నారు.

కర్నూలు అగ్రికల్చర్‌: చంద్రబాబు సారధ్యంలో రాష్ట్రం అభివృద్దిలో పరుగులు పెడుతుందని కర్నూలు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన గొల్కోండ అజ్మిత బీ అన్నారు. సోమవారం చంద్రబాబు జన్మదిన వేడుకలను చైర్మన ఆధ్వర్యంలో నిర్వహించారు. సెలక్షన గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి, వైస్‌ చైర్మన శేషగిరిశెట్టి, డైరెక్టర్లు మారుతిశర్మ, సువార్తమ్మ, చిన్నమ్మ, లక్ష్మి మాధవస్వామి, శ్రీధర్‌, టీడీపీ నాయకులు ఏసన్న, వెంకటేశ గౌడు, నాగేశ్వరరావు, శివ, మున్ని, శారదమ్మ, సుప్రియ పాల్గొన్నారు.

ఓర్వకల్లు: మండలంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన.కొంతలపాడులో టీడీపీ మండల కన్వీనర్‌ నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరై కేక్‌ కట్‌ చేశారు. హుశేనాపురలో టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్‌ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అలాగే ఓర్వకల్లులో సింగిల్‌ విండో చైర్మన సుధాకర్‌రావు, నన్నూ రులో విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు గోవిందరెడ్డి, నంద్యాల పార్లమెంటు ట్రెజరర్‌ మహబూబ్‌ బాషా, కాల్వబుగ్గ చైర్మన కాటినేని నారాయణ, నన్నూరు సింగిల్‌ విండో చైర్మన నాగేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, రాంభూపాల్‌ రెడ్డి, శ్రీనివాసులు, కోటేశ్వరరావు, గొల్ల నాగరాజు, బజారు, వేణు, హరినాయుడు పాల్గొన్నారు.

కర్నూలు న్యూసిటీ: స్థానిక 52వ వార్డులో టీడీపీ నాయకుడు వి.శ్రీనివాసులు అధ్వర్యంలో చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు వై.నరసింహులు, వార్డు ఇనచార్జి రాంబాబు, సత్యబాబు, విజేయుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

గూడూరు: పేదల మనిషి చంద్రబాబు అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. సోమవారం గూడూరులో టీటీపీ పట్టణ అధ్యక్షుడు కురుకుంద రామాంజనేయులు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం అన్నా క్యాంటీనను సందర్శించి పేదలకు అన్నం వడ్డించి వారందరితో కలిసి క్యాంటీన లోనే భోజనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్న క్యాంటీన ద్వారా రూ.5కే పేదలకు అన్నం పెట్టిన మహానుభావుడన్నారు. కార్యక్ర మంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు కురుకుంద రామాంజనేయులు, సింగిల్‌ విండో డైరెక్టర్‌ రేమట వెంకటేశేష్‌, మాజీ కౌన్సిలర్లు కోడుమూరు షాషావలి, బుడ్డంగలి, టీడీపీ నాయకులు పౌలు, మన్సుర్‌ బాషా, తెలుగు శ్రీనివాసులు, నాగప్ప యాదవ్‌, డాక్టర్‌ మన్నన బాషా, పెద్ద చాంద్‌ బాషా పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 12:37 AM