అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్ చంద్రబాబు
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:00 AM
అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్‌గా సీఎం చంద్రబాబు ఉంటున్నారని ఎమ్మెల్సీ బీటీ. నాయుడు అన్నారు.
టీడీపీ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు
కర్నూలు అర్బన్, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్‌గా సీఎం చంద్రబాబు ఉంటున్నారని ఎమ్మెల్సీ బీటీ. నాయుడు అన్నారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీతో పాటు కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, డీసీఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వరయాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంతక ముందు దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పార్టీలో పని చేసిన కార్యకర్తలకు, నాయకులకు తగిన విధంగా గుర్తింపునిస్తూ వారిని ప్రోత్సహించడంలో చంద్రబాబు ముందుంటారన్నారు. పరిపాలనలో మంచి సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. 2024 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఓడించి ముఖ్యమంత్రి బాఽధ్యతలు చేపట్టాన తర్వాత రాష్ట్ర అర్థిక పరిస్థితిని చంద్రబాబు గాడిలో పెట్టారన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకొస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అకెపోగు ప్రభాకర్, మాజీ ఎంపీ సంజీవకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు నంద్యాల నాగేంద్ర, సంజీవలక్ష్మి, ధరూర్ జేమ్స్, లక్ష్మినారాయణ, విజయకుమార్, ప్రసాద్, ముంతాజ్ బేగం, నగర అఽధ్యక్షులు కె.రవికుమార్, జకియా అక్సారీ, తెలుగు యువత జిల్లా అఽధ్యక్షుడు అబ్బాస్, పద్మలత, వి.హనుమంతరావు చౌదరి, వైద్య విభాగం అధ్యక్షుడు సపెర్ల ప్రవీన్ ఆనంద్, సుగూరు వెంకటేశ్వర్లు, చంద్రకాంత్ , తిరుపాల్ బాబు పాల్గొన్నారు.