Share News

చైన్‌ స్నాచర్ల అరెస్టు

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:20 AM

నాలుగో పట్టణ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఉల్చాల రోడ్డు ఆదిత్యనగర్‌లో జరిగిన ఓ చైన్‌స్నాచింగ్‌ కేసులో బిహార్‌ వాసులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ విక్రమసింహ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసుల బృందం ఈ ఇద్దరు నిందితులను పట్టుకున్నారు.

చైన్‌ స్నాచర్ల అరెస్టు
నిందితులను చూపుతున్న పోలీసులు

కర్నూలు క్రైం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): నాలుగో పట్టణ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఉల్చాల రోడ్డు ఆదిత్యనగర్‌లో జరిగిన ఓ చైన్‌స్నాచింగ్‌ కేసులో బిహార్‌ వాసులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ విక్రమసింహ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసుల బృందం ఈ ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. నిందితులు రవికుమార్‌ కేసరి, దీప్‌ కుమార్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1.4లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గత నెల 20వ తేదీ ఉదయం ఆదిత్యనగర్‌లో చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముందురోజు సాయంత్రం తాలుకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మాసామసీదు వద్ద ఓ చైన్‌ స్నాచింగ్‌ యత్నం జరిగింది. ఈ రెండు చోట్ల సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు ఈరెండు స్నాచింగ్‌లు ఒకరే చేసినట్లుగా ఆనవాలు దొరికాయి. ముందు రోజు సాయంత్రం ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆ రోజు రాత్రి ఎక్కడైనా డార్మెంటరీలో షెల్టర్‌ తీసుకుని ఉండవచ్చని భావించిన పోలీసులు బస్టాండు ప్రాంతంలో ఉన్న అన్ని డార్మెటరీలను ఆరా తీశారు. డార్మెటరీ నిర్వాహకులకు ఇచ్చిన ఆధార్‌కార్డు, ఫోన్‌ నెంబర్లను పరిశీలించారు. ఎవరైనా రాజస్థాన్‌, బిహార్‌, చత్తీ్‌సఘడ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందినవారు ఆధార్‌ కార్డులు, ఫోన్‌ నెంబర్లు ఇచ్చారేమోనని సుమారు ఐదారు డార్మెటరీలో గాలించారు. ఓ డార్మెటరీలో ఆధార్‌కార్డు, ఫోన్‌ నెంబర్లు బిహార్‌ రాష్ట్రంకి చెందిన సిరీ్‌సలో ఉన్నట్లు గుర్తించి ఆ నెం బర్లపై ఆరా తీశారు. అవి డూప్లికేట్‌ అని తేలింది. పోలీసులకు ఆ నిందితులు బిహార్‌ వాసులే అని అనుమానం వచ్చి పాట్నాకు చెందిన కొంతమందిని పోలీసులు సంప్రదిం చారు. ఇక్కడి సీసీ పుటేజీలను వారికి పంపి ఆరా తీశారు. అక్కడి ఐదారు టీమ్‌లను ఆరా తీయగా ఓ పోలీస్‌ టీమ్‌ ఈ సీసీ ఫుటేజీల నిందితులను గుర్తు పట్టి నిందితులు పాట్నాలోని బాకర్‌గంజ్‌ ప్రాంతానికి తేల్చారు. పోలీసులు ప్రత్యేకంగా రెండు బృందాలుగా ఏర్పడి వారి కోసం రెండుసార్లు పాట్నా వెళ్లి ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను ఇద్దరిని నాలుగో పట్టణ పోలీసులు కోర్టులో హాజరు పరిచిన వెంటనే వారికి బెయిల్‌ మంజూరు కావడం విశేషం. దీంతో కంగుతిన్న పోలీసులు వెంటనే తాలుకా పోలీసులు అప్పటికే వీరిపై నమోదు చేసిన కేసులో అరెస్టు చేశారు. వీరిని మరోసారి నేడు కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ నిందితులు ఇద్దరు వైజాగ్‌ ప్రాంతంలో కూడా చైన్‌ స్నాచ్‌లు చేసినట్లుగా గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఎస్‌ఐలు, కానిస్టేబుల్లు జీనస్‌, శ్రీనివాసులు, మురళిధర్‌ను సీఐ అభినందించారు.

Updated Date - Jul 25 , 2026 | 12:20 AM