Share News

కేంద్ర పథకాలు పటిష్టంగా అమలు చేయాలి

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:21 PM

కేంద్ర ప్రాయోజిత పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా, సమ ర్థవంతంగా అమలు చేయాలని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌ లంకా దినకర్‌ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.

కేంద్ర పథకాలు పటిష్టంగా అమలు చేయాలి
మాట్లాడుతున్న లంకా దినకర్‌ పక్కన కలెక్టర్‌ రాజకుమారి

20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌

నంద్యాల నూనెపల్లి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రాయోజిత పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా, సమ ర్థవంతంగా అమలు చేయాలని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌ లంకా దినకర్‌ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. గురు వారం నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులలో ఆయన అధ్యక్షతన 20 సూత్రాల ఫార్ములా అమలుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వీబీ-జీ రామ్‌ జీ (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌) కార్యక్రమాన్ని ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొత్త విధానంలో లేబర్‌, మెటీరియల్‌, పరిపాలనా వ్యయాలను కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులతో భరిస్తుందన్నారు. దీని ద్వారా ఉపాధి హామీ పనిదినాలు 100 నుంచి 125 రోజుల వరకు పెరుగుతాయని అన్నారు. జననీ సురక్ష యోజన కింద గర్భిణులకు అందుతున్న సేవలు, నగదు సహాయంపై వివరాలు తెలుసుకున్నారు. పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధికి వివిధ దశల్లో మంజూరైన నిధులను మార్చి 31 నాటికి పూర్తిగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. జలజీవన్‌ మిషన్‌ కింద ఎస్సీ, బీసీ కాలనీల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. మెప్మా మహిళా సంఘాల ద్వారా పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమ న్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వలసల రామకృష్ణ, డీఆర్వో రామునాయక్‌, సీపీఓ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 11:21 PM