Share News

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:08 AM

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశాయి.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి
zలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు,

విద్యార్థి నాయకుల డిమాండ్‌

ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశాయి. ఢిల్లీలో శాంతియుతంగా పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాలు, యువకులను అక్రమ అరెస్టులకు నిరసనగా మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాసులు, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సోమన్న మాట్లాడుతూ లాఠీలు, తూటాలు, బాష్పవాయువులు విద్యార్థి, యువజనుల ఉద్యమాలను ఆపలేరని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత నెల 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా దశలవారీగా ఆందోళనలు, నిరసనలు, ఆమరణ నిరాహారదీక్షలు చేస్తున్నా కూడా కేంద్రం స్పందించక పోవడం అన్యాయమన్నారు. ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి రాజీవ్‌, నగర అధ్యక్షుడు నాగరాజు, అఖిల్‌, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి శరత్‌ కుమార్‌, నగర అధ్యక్షులు అభి పాల్గొన్నారు.

ఆర్‌యూలో ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో..

కర్నూలు అర్బన్‌: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ సహాయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని నిరసిస్తూ మంగళవారం ఆర్‌యూలో ఆందోళన చేపట్టారు. సదీప్‌ నాయక్‌, ఓబులేష్‌, శ్యామ్‌, రవీ, గణేష్‌, సన్నీ, మహేష్‌, పవన్‌ ప్రవీణ్‌, అర్జున్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 12:08 AM