కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి
ABN , Publish Date - May 13 , 2026 | 12:16 AM
కొడుకుపై పోక్సో కేసుకు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి శ్రావణి రెడ్డి డిమాండ్ చేశారు.
ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి శ్రావణి రెడ్డి
కర్నూలు న్యూసిటీ, మే 12(ఆంధ్రజ్యోతి): కొడుకుపై పోక్సో కేసుకు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి శ్రావణి రెడ్డి డిమాండ్ చేశారు. బాలికపై అత్యాచారం చేసిన బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ మంగళవారం సమాఖ్య అధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నగర కార్యదర్శి వి. భారతి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణిరెడ్డి మాట్లాడుతూ మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు. తెలంగాణ పోలీసులు ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారించి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గిడ్డమ్మ, నాయకురాలు బేబీ, రాణి, ధనలక్ష్మి, జానూ, సోఫియా, మాధవి, సుధా, మహేష్, బీసన్న, నాగరాజు పాల్గొన్నారు.