Share News

దేశాభివృద్ధిలో జనగణన కీలకపాత్ర

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:45 PM

దేశాభివృద్ధిలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని జేసీ నూరుల్‌ ఖమర్‌ అన్నారు. ఆదివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొం డారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్‌ వరకు 5కే రన్‌ నిర్వహించారు.

దేశాభివృద్ధిలో జనగణన కీలకపాత్ర
5కే రన్‌ను జెండా ఊపి ప్రారంభిస్తున్న జేసీ, కమిషనర్‌

జేసీ నూరుల్‌ ఖమర్‌

జనగణనపై అవగాహన కోసం 5కే రన్‌

కర్నూలు స్పోర్ట్స్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధిలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని జేసీ నూరుల్‌ ఖమర్‌ అన్నారు. ఆదివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొం డారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్‌ వరకు 5కే రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీతో పాటు నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు హాజరై జెండా ఊపి 5కే రన్‌ను ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు నుంచి కంట్రోల్‌ రూమ్‌, కిడ్స్‌ వరల్డ్‌, రాజ్‌విహార్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు ఈ రన్‌ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. పురుషుల విభాగంలో మనీష్‌, గోవింద్‌, వెంకట్‌ భరత్‌ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధిం చారు. మహిళల విభాగంలో రేణుక, సోనాక్షి, రామలక్ష్మి మొదటి, రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. విజేతలకు ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ ప్రైజ్‌లుగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేల నగదును అందజేశారు. జేసీ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముం దుకొచ్చి స్వీయ జనగణనలో భాగంగా తమ వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు మాట్లాడుతూ మే 1వ నుంచి ఇంటిం టా జనగణన సర్వే ప్రారంభమవుతుందన్నారు. ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఆ ర్వో చిరంజీవి, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌ రెడ్డి, సెన్సస్‌ ఇన్‌చార్జి అధికారి ఇజ్రాయిల్‌, ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అదికారి డా.ఎంరఘు, జిల్లా క్రీడల అభివృద్ధి అఽధికారి భూపతిరావు, క్రీడా సంఘాల ప్రతినిధులు ఈరన్‌లో పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 11:45 PM