దేశాభివృద్ధికి కీలకం జనగణన
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:30 PM
దేశాభివృద్ధికి కీలకం జనగణన అని కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు.
కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధికి కీలకం జనగణన అని కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు. శనివారం స్థానిక పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో రెండో రోజు నిర్వహిస్తున్న భారత జనగణన కార్యక్రమాల నిర్వహణపై జిల్లా అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇమ్యూనేటర్లు ఫీల్డ్ స్థా యిలో ప్రతి ఇంటిని సందర్శించి నిర్ధేశిత విధానాల ప్రకారం కచ్చితమైన వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. జనగణనలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం అత్యంత అవసరమని, క్వాలిటీ కమిటీలను పాటించాలన్నారు. శిక్షణలో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. శిక్షణా బోధన తీరును అధికారులతో కలిసి పరిశీలించారు. డీఆర్వో వెంకట నారాయణమ్మ, జనగణన అదికారి జాయింట్ డైరెక్టర్ డా.జగన్నాథ్, డిప్యూటీ డైరెక్టర్ దివాకర్ బరీహా, జిల్లా కోఆర్డినేటర్ దీపక్ భరద్వాజ్, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, పంచాయతీ అధికారి భాస్కర్, డీఈవో సుధాకర్; కర్నూలు, పత్తికొండ ఆర్డీవోలు సందీప్ కుమార్, కొండయ్య పాల్గొన్నారు.