Share News

మహానందిలో జనగణన

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:26 PM

రాష్ట్ర ప్రభుత్వం జన గణనను మహానందిలో ముందస్తు ప్రయోగాత్మక (పైలట్‌) సర్వేలను చేపట్టింది.

మహానందిలో జనగణన
జనగణన ను నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులు

ప్రయోగాత్మకంగా ఎంపికైన మండలం

మహానంది, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం జన గణనను మహానందిలో ముందస్తు ప్రయోగాత్మక (పైలట్‌) సర్వేలను చేపట్టింది. రాష్ట్రంలో మహానందితో పాటు విశాఖపట్నంలో మాత్రమే పైలట్‌ ప్రాజెక్టుగా సర్వేలను చేపట్టింది. దేశవ్యాప్తంగా చేపడుతున్న ఈ డిజిటల్‌ జనాభా గణనలో మొదటి దశ పూర్తయింది. హౌస్‌ లిస్టింగ్‌, గృహ గణన సర్వేవలు పూర్తయ్యాయి. అయితే రెండో దశలో భాగమైన జన గణనను అధికారులు మంగళవారం నుంచి మహానందిలో చేపట్టారు. మండలంలోని బొల్లవరం, తిమ్మాపురం, గోపవరం,బుక్కాపురం,తమ్మడపల్లి గ్రామా ల్లో జనగణన చేపట్టింది. ఉపాధ్యాయులు ఎంపిక చేసిన గ్రామాల్లో చేపట్టిన జనగణనను తహసీల్దార్‌ రమాదేవి, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు పర్యవేక్షించారు. వివరాలను సేకరిస్తున్న ఉపాఽధ్యాయులకు ఆర్‌ఐ పలు సూచనలు చేశారు. ఇదిలా ఉండగా జనగణనలో కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయని ఉపాధ్యాయులు రెవెన్యూ అధికారుల దృష్టికి తెచ్చారు.

Updated Date - Jul 07 , 2026 | 11:26 PM