సెల్‌ఫోన్ల దొంగలు అరెస్టు
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:04 AM
సెల్‌ఫోన్లు చోరీ చేసే నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు బనగానపల్లె పట్టణ సీఐ ప్రవీణ్‌కు మార్ తెలిపారు.
30 ఫోన్లు స్వాధీనం
బనగానపల్లె, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్లు చోరీ చేసే నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు బనగానపల్లె పట్టణ సీఐ ప్రవీణ్‌కు మార్ తెలిపారు. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన గుడ్డి ఏసు ఆలియాస్ యశ్వంత్ అనే వ్యక్తి సెల్‌ఫోన్లు దొంగిలించి ఇస్తే నెలకు రూ.20వేలు జీతం ఇస్తానని నలుగురితో ఒప్పందం చేసుకున్నారు. ఈమే రకు హైదరాబాద్‌కు చెందిన రమేశ్, లక్ష్మయ్య, నిఖిల్, చరణ్‌లు ఏపీలోని ప్రధాన పట్టణాల్లో బస్టాండ్, రద్దీగా ఉండే ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌లు దొం గిలించి గుడ్డి ఏసుకు అప్పజెప్పేవారు. వీటిని అధిక ధరలకు విక్రయిస్తూ అతడు ఆదాయం పొందేవాడు. ఈ నేపథ్యంలో శనివారం వారు కారులో బనగానపల్లె మీదుగా గుత్తికి వెళ్తున్నారు. సాయిబాబా ఆలయం సమీపంలో ఎస్‌ఐ దుగ్గిరెడ్డి, పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. సెల్‌ఫోన్ల దొంగలు పోలీసులను చూసి కారును వెనుకకు మరలిస్తుండగా అనుమానం వచ్చి కారును ఆపి చెక్ చేశారు. వారి వద్ద 30 సెల్‌ఫోన్లు ఉండటంతో విచారించారు. వివిధ పట్టణాల్లో దొంగిలించినట్లు అంగీకరించారు. నలుగురు దొంగలతో పాటు 30 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని అరె్‌స్టచేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ కల్పన, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.