Share News

రాఘవేంద్రుడి సన్నిధిలో ప్రముఖులు

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:10 AM

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ప్రముఖులు ఆదివారం వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు.

రాఘవేంద్రుడి సన్నిధిలో ప్రముఖులు
కేంద్ర మంత్రికి జ్ఞాపికను అందజేస్తున్న పీఠాధిపతి

దర్శించుకున్న కేంద్ర మంత్రి, ఏపీ, కర్ణాటక హైకోర్టుల న్యాయమూర్తులు

మంత్రాలయం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ప్రముఖులు ఆదివారం వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్‌ శ్రీశానంద, కర్నాటక ఉప లోకాయుక్త ఫణీంద్ర, ఇంటర్నేషనల్‌ మాజీ క్రికెటర్‌, కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ) ప్రెసిడెంట్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ దర్శించుకున్నారు. వీరికి మహాముఖ ద్వారం వద్ద మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంటేష్‌ జోషి, సురేష్‌ కోణాపూర్‌, శ్రీపతి ఆచార్‌, ఐపీ నరసింహమూర్తి, ఆదోని సబ్‌కలెక్టర్‌ అజయ్‌కుమార్‌, డీఎ స్పీ భార్గవి, సీఐ రామాంజులు స్వాగతం పలికారు. ప్రము ఖులు గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అనంతపురాణిక్‌, జేపీస్వామి, వ్యాసరాజచార్‌, విజయేంద్రాచార్‌, అనంతస్వామి, సంజీవ్‌కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:10 AM