అంబరాన్నంటిన సంబరాలు
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:24 PM
అమరావతి బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందడంతో జిల్లా వ్యాప్తంగా గురువారం కూటమి శ్రేణుల సంబరాలు అంబరా న్నంటాయి.
వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్
పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సందడి
ఉత్సాహంగా బైక్ , కొవ్వొత్తుల ర్యాలీ
ఆనందోత్సాహంలో కూటమి శ్రేణులు
నంద్యాల, ఏప్రిల్2(ఆంధ్రజ్యోతి): అమరావతి బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందడంతో జిల్లా వ్యాప్తంగా గురువారం కూటమి శ్రేణుల సంబరాలు అంబరా న్నంటాయి. బైకు, కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు. జై అమ రావతి.. జైజై అమరావతి అంటూ నినాదాలతో కూటమి శ్రేణు లు హొరెత్తించారు. నంద్యాల పట్టణంలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ కూటమి శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. నందికొ ట్కూరులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, పటేల్ విగ్రహాల వరకు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తదితర నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి పూల మాలలు వేసి కేక్ కట్ చేశారు. టపాసులు పేల్చారు. బనగానపల్లెలో మంత్రి బీసీ సోదరులు, కొలిమిగుండ్లలో కూటమి శ్రేణుల సమక్షల్లో సంబరాలు జరుపు కున్నారు. డోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, పాణ్యం పట్టణ కేంద్రంలో కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్‌చేసి బైక్ ర్యాలీ నిర్వహించి నినాదాలతో హొరెత్తించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ భవన్‌లో అమరావతి- ఆంధ్ర ప్రదేశ్ శాశ్విత రా జధాని వేడుకలువైభవంగా నిర్వహించారు. కలెక్టర్ రాజకు మారి చిన్నారులతో కలిసి కేక్ కట్‌చేశారు. జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోను సదరు వేడుకలను నిర్వహించారు.
రాష్ట్ర భవిష్యత్తుకు ప్రతీక..
అమరావతి కేవలం రాజధాని నగరమే కాకుండా రాష్ట్ర భ విష్యత్‌కు ప్రతీక. అభివృద్ధి, పారదర్శక పాలన, ఆధునిక మౌలి క సదుపాయాల సమాహారంగా అమరావతి అభివృద్ధి చెందుతుంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని సాధ్యం చేసిన సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం తరుపున ప్రత్యేక అభినందనలు.
రాజకుమారి, కలెక్టర్, నంద్యాల
అమరావతిని రాజధానిగా నిలబెట్టడం..
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో అమరావతిని ఒకే రాజధానిగా నిలబెట్టడం చారిత్రాత్మక ఘట్టం. శాంతియుతంగా పోరాడిన రైతుల త్యాగాలకు దక్కిన న్యాయం. రాబోవు తరతరాలకు అమరావతి అభివృద్ధి సంక్షేమానికి రెండు కళ్లుగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందే బ్రాండ్‌గా అమరావతి నిలుస్తుంది.
ఎన్‌ఎండీ ఫరూక్, న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి