వాడవాడలా సంబరాలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:24 AM
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో వాడవాడలా టీడీపీ శ్రేణులు, అధికారులు సంబరాలు చేసుకున్నారు.
రాజధాని అమరావతి బిల్లుపై సర్వత్రా హర్షం
ఆనందంలో టీడీపీ శ్రేణులు
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో వాడవాడలా టీడీపీ శ్రేణులు, అధికారులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు వారు ధన్యవాదాలు తెలిపారు.
శాశ్వత రాజధానితో ఏపీ సమగ్రాభివృద్ధి : ఎమ్మెల్యే దస్తగిరి
గూడూరు ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): శాశ్వత రాజధాని ఏర్పాటుతో ఏపీ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. గురువారం మండలంలోని కె నాగలాపురం గ్రామంలో ఏపీకి శాశ్వత రాజధాని బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన సందర్భంగా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఆయన వెంట మండల టీడీపీ అధ్యక్షుడు జె సురేష్, గోపాల్ రెడ్డి, టీడీపీ నాయకులు ఉన్నారు.
అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం
కల్లూరు: ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ లోక్‌సభలో బిల్లు అమోదం పొందడంపై పాణ్యం నియోజకవర్గం టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గౌరు చరిత ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచి, కేక్‌కట్ చేసి టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడంలో ఏపీ సీఎం చంద్ర బాబు కీలక భూమిక పోషించారని తెలిపారు. కార్యక్రమంలో కల్లూరు అర్బన కన్వీనర్ పెరుగు పురుషోత్తంరెడ్డి, ఓర్వకల్లు మండల కన్వీనర్ బి.నాగిరెడ్డి, ప్రభాకర్‌యాదవ్, ఏపి డైరెక్టర్లు డి.రామాంజనేయులు, జి. నాగముని, రామగిడ్డయ్య, పర్ల.శేఖర్, పియూ.మాదన్న, మాదేష్, చిన్నబీచుపల్లి పాల్గొన్నారు.
అమరావతి చట్టబద్ధతపై సంబరాలు
కర్నూలు ఎడ్యుకేషన: రాష్ట్ర రాజధాని అమరావతికి ఉభయసభల ఆమోదంతో చట్టబద్ధత కల్పించడంపై ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. గురువారం స్థానిక ఎస్‌ఏపీ క్యాంపులోని కట్టమంచి రామ లింగారెడ్డి స్మారక నగర పాలక ఉన్నత పాఠశాలలో ప్రధానో పాధ్యా యుడు టి.వెంకటరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ విభజన జరిగి 11 సంత్సరాలు పూర్తయిన అనంతరం ఏపీ రాజధాని అమరావతికి చట్టబ ద్ధత లేకపోవంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో చట్టబద్దత తీసుకువచ్చిందన్నారు. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పూర్తి మెజారీటితో పార్లమెంటు ఆమోదం కోసం ఏపీ అసెంబ్లీలో చేసి పంపిన తీర్మానంపై లోక్‌సభలో సుధీర్ఘ చర్చ జరిగిన అనంతరం అమరావతి బిల్లు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశా రు. ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ, ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్ శాసనసభ్యులకు పార్లమెంటు సభ్యులకు ఈ సందర్భంగా వారు అభినం దనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరికృష్ణ, భాస్కర్, నీలమణి, ఉపాద్యాయులు, బీఈడీ శిక్షణ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మెప్మా ఆధ్వర్యంలో..
కర్నూలు న్యూసిటీ: పార్లమెంటు ఉభయ సభల్లో రాజధానిగా అమరావతికి చట్టబద్దత బిల్లు ఆమోదం పొందడంపై నగర పాలక ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం రాత్రి 7 గంటలకు అదనపు కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్, ఉద్యోగులు కొవ్వొత్తు పట్టుకుని హర్షం వ్యక్తం చేశారు. అదనపు కమిషనర్ మా ట్లాడుతూ అమరావతి చట్టబద్ధంగా ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవమని అభివర్ణించారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరా ముడు, సూపరింటెండెంట్లు ఇజ్రాయేలు, రామక్రిష్ణ, సిబ్బంది శ్రీనివా సులు, వీర కుమార్, వినోద్ పాల్గొన్నారు.
కోడుమూరు రూరల్: ఏపీ రాజధాని అమరావతి బిల్లు చట్టబద్ధతకు పార్లమెంటు ఆమోదం లభించడంతో అడ్డంకులు తొలగాయని టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి అమడగుంట్ల బస్టాండు వద్ద టీడీపీ నాయకులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. చిల్లబండలో మైనార్టీ నాయకుడు బాషా కుటుంబం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌కు ధన్యవా దాలు తెలిపారు.