బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా జరిపించండి
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:37 PM
శ్రీశైలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతిష్టాత్మకంగా జరిపించాలని ఈవో శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.
శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతిష్టాత్మకంగా జరిపించాలని ఈవో శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శనివారం పరిపాలనా భవనంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లపై ఆయా ప్రధాన విభాగాధిపతులతో చర్చించారు. ప్రధానంగా గత ఏడాది కంటే మరో 30 శాతం భక్తులు అధికంగా రానున్నట్లు అంచనా వేసుకుని మౌలిక సదుపాయాలు కల్పించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాదయాత్రతో వచ్చే యాత్రికులకు కూడా కావలసిని ఏర్పాట్లపై అటవీశాఖ అధికారులతో సమీక్షంచి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూలైన్లు, తాత్కాలిక వసతి పందిళ్లు, మంచినీరు, సమాచార కేంద్రాలు, పార్కింగ్, పారిశుధ్య నిర్వహణ, అల్పాహారాలు అన్నప్రసాద వితరణ, అత్యవసర వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు సిబ్బందికి ఈవో సూచనలు చేశారు.