Share News

పెచ్చులూడి పడ్డాయి

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:17 AM

డీఎంహెచ్‌వో కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో డీఎంహెచ్‌వో ఆఫీసు మొదటి అంతస్థులోని డిప్యూటీ హెచ్‌ఈవో గదిలో బుధవారం పెచ్చులూడి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

పెచ్చులూడి పడ్డాయి
పెచ్చులూడిన డిప్యూటీ హెచ్‌ఈవో గది

డిప్యూటీ హెచ్‌ఈవో గదిలో ఘటన

తప్పిన ప్రమాదం

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): డీఎంహెచ్‌వో కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో డీఎంహెచ్‌వో ఆఫీసు మొదటి అంతస్థులోని డిప్యూటీ హెచ్‌ఈవో గదిలో బుధవారం పెచ్చులూడి పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. శిథిలావస్థకు చేరిన ఈ భవనం గతంలో ఫిమేల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, నర్సుల శిక్షణ కేంద్రంగా ఉండేది. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాకు కొత్త డీఎంహెచ్‌వో భవనాలున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల కర్నూలుకు ఇంత వరకు భవనం లేకుండా చేశారు. 2001లో కొత్త భవనానికి ప్రతిపాదనలు వెళ్లినా ముందుకు సాగలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కర్నూలు డీఎంహెచ్‌వో కార్యాలయానికి కొత్త భవనం మంజూరు చేయాలని ఉద్యోగులు, ప్రజా సంఘాలు కోరుతున్నారు.

Updated Date - Sep 24 , 2026 | 12:17 AM