సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలి
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:20 AM
ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. వామపక్షాలైన సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ ఎంల్‌మా్‌సలైన్, ఎస్‌యూసీఐ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.
వామపక్ష నాయకుల డిమాండ్
కలెక్టరేట్ ఎదుట నిరసన
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. వామపక్షాలైన సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ ఎంల్‌మా్‌సలైన్, ఎస్‌యూసీఐ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ స భ్యురాలు నిర్మల, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప మాట్లాడుతూ దేశంలో ‘సర్’ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. ఆర్‌ఎ్‌సఎస్, బీజేపీలకు తొత్తుగా వ్యవహరిస్తున్న జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని, అక్టోబర్ 2న గాంధీ విగ్రహాల ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు టి.రాముడు, రామక్రిష్ణారెడ్డి, వెంకట స్వామి, తిరుపాలు, వెంకటేష్, నాగన్న, ఎండి.అంజిబాబు, ఆనంద్‌బాబు, రాజశేఖర్, విజయ్, నగేష్, గురుశేఖర్, సాయిబాబ, అన్వర్, భద్రకుమార్ పాల్గొన్నారు.