సర్వజన అవస్థ
ABN , Publish Date - Jan 13 , 2026 | 01:00 AM
పెద్దాసుపత్రిలోని న్యూడయాగ్నోస్టిక్ బ్లాక్‌లో కాంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) అందక రోగులు అసవ్థలు పడుతున్నారు. ప్రింటర్ పనిచేయకపోవడంతో సమస్య తలెత్తింది.
పెద్దాసుపత్రిలో పనిచేయని సీబీపీ ప్రింటర్
రోగుల ఇబ్బందులు
కర్నూలు హాస్పిటల్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): పెద్దాసుపత్రిలోని న్యూడయాగ్నోస్టిక్ బ్లాక్‌లో కాంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) అందక రోగులు అసవ్థలు పడుతున్నారు. ప్రింటర్ పనిచేయకపోవడంతో సమస్య తలెత్తింది. గతంలో ప్రతిరోజు 500 మంది రోగులు వచ్చేవారు, అయితే ఆదివారం 1400 మందికి, సోమవారం 1100 మందికి పరీక్షలు నిర్వహించారు. న్యూడయోగ్నస్టిక్ బ్లాక్‌లో మొదటి అంతస్థులోని సీబీపీ మిషన్లలో ఒక దానికి ప్రింటర్ లేకపోవడంతో నిరూపయోగంగా మారింది. ఆసుపత్రి అధికారులు మరమ్మతులు చేయించి, కష్టాలు తీర్చాలని రోగులు కోరుతున్నారు.