కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:33 PM
న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగిలా బెంచ్‌కు, బార్‌కు సహకరిస్తూ త్వరితగతిన కేసులను పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేకూర్చాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ పిలుపునిచ్చారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్
నంద్యాలలో అదనపు కోర్టు భవనాలు ప్రారంభం
నంద్యాల క్రైం, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగిలా బెంచ్‌కు, బార్‌కు సహకరిస్తూ త్వరితగతిన కేసులను పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేకూర్చాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. నంద్యాల కోర్టు భవనాల సముదాయంలో నూతనంగా ఏర్పాటుచేసిన తొమ్మిదో అదనపు జిల్లా కోర్టుతో పాటు రెండు, మూడు, నాలుగో అదనపు కోర్టులను ఆదివారం ప్రారంభించారు. అదనపు కోర్టులో కాల్‌వర్క్ కార్యక్రమాన్ని పర్యవేక్షించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అదనపు కోర్టు భవనాల వల్ల యువ న్యాయవా దులకు మంచి అవకాశం లభిస్తుందన్నారు. సీనియర్ న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకుని వృత్తిలో రాణించాలని ఆయన సూచించారు. న్యాయమూర్తులు జిస్టిస్ శ్రీనివాసరెడ్డి, జస్టిస్ హరిహరనాథ శర్మ మాట్లా డుతూ న్యాయవాదులు ప్రతిభతో పాటు నైతిక విలువలు పాటించి జూనియ ర్లకు ఆదర్శంగా కక్షిదారులకు న్యాయం అందించేలా పేరు తీసుకురా వాలన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన న్యా యాధికారి కబర్ధి మాట్లాడు తూ నంద్యాల లో నాలుగు, కర్నూలులో రెండు, నందికొ ట్కూరులో ఒకటి చొప్పున అదనపు కోర్టులు ప్రారంభించినట్లు చెప్పారు. సీనియర్ న్యాయ వాదులు రామచంద్రారెడ్డి, రామచంద్రారావు మాట్లాడు తూ కోర్టు కేసుల పరిదిపై వివరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు రామసుబ్బయ్య, పెద్ది శ్రీనివా సులు, తిమ్మారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, గౌరీశంకర్, హుస్సేన్‌బాషా, శ్రీనివాస రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, తులసిరెడ్డి, కృపావతి, బైరెడ్డి శ్రీదేవి, వివేకానందరెడ్డి, రాజే శ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, మహ మ్మద్ రఫి, రామ్మో హన్‌రెడ్డి, జయకృష్ణ, ఖలీల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.