ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసులు ఎత్తివేయాలి
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:39 AM
: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై పెట్టిన కేసులు అక్రమమని, ఆ కేసులు ఎత్తివేసి ఆయనను వెంటనే విడుదల చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై పెట్టిన కేసులు అక్రమమని, ఆ కేసులు ఎత్తివేసి ఆయనను వెంటనే విడుదల చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద ఉన్న సబ్‌జైలులో ఎమ్మెల్యే విరూపాక్షితో రామకృష్ణతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్, కె.రామాంజనేయులు, పి.రామచంద్రయ్య ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వద్ద రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. 45 మందిని జైలులో 65 రోజులు నిర్బంధించడం దుర్మార్గమని అన్నారు. ఏ తప్పూ చేయని, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ ఎమ్మెల్యేని జైలులో నిర్బంధించడం ఏమిటని శ్నించారు. విరూపాక్షిపై గతంలో ఎప్పుడూ కేసులు లేవని, అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేసి విడుదల చేయాలని సీఎం చంద్రబాబుకు ఉత్తరం రాస్తానని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పెద్దఎత్తున అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఆరోపించారు.కార్యక్రమంలో సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రయ్య, సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు